రోడ్డు ప్రమాదంలో నలుగురు మెడికోల దుర్మరణం

 8888– మృతులంతా ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులు

– విజయవాడ సమీపంలో దుర్ఘటన.. చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు

విజయవాడ(భవానీపురం), ఇబ్రహీంపట్నం:

విజయవాడలో ప్రైవేటు బస్సు చెట్టుకు ఢీకొట్టి, బోల్తా పడిన ప్రమాదంలో హైదరాబాద్‌ ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, బస్సు డ్రైవరు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది మెడికోలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై గొల్లపూడి పరిధిలోని నల్లకుంట సెంటర్‌ వద్ద సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్‌ మద్యం మత్తులో అతి వేగంగా బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో బస్సు నడపొద్దని అభ్యంతరం చెప్పిన తమతో గొడవపడి డ్రైవర్‌, వేగంగా వెళుతూ బస్సును హఠాత్తుగా ఒక పక్కకు తిప్పి ప్రమాదానికి కారణం అయ్యాడని విద్యార్థులు తెలిపారు.విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాలు..

మృతుల వివరాలు: మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య
విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్‌కు వెళ్లి అక్కడే భోజనాలు చేశారని సమాచారం. బస్సు డ్రైవర్ ను వేముల వెంకట శివయ్య గా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనా స్థలికి ప్రిన్సిపాల్ ప్రభాకర్, డీఎంఈ రమణి చేరుకున్నారు. విద్యార్థులను ఘటనా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తాజావార్తలు