ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా ఆరా..
తిరుపతి : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి ఘటన మరిచిపోక ముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి. అనంతరం విసి, రిజిష్ట్రార్ లు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ర్యాగింగ్ జరిగిందని ధృవీకరించారు. దీనికి సంబంధం ఉన్న ముగ్గురు విద్యార్థులపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యారు.
ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. వెంటనే ఎస్వీయూ అధికారులతో గంటా ఫోన్ లో మాట్లాడారు. ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గంటా పలు ఆదేశాలు జారీ చేశారు