లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 14 (జనం సాక్షి)సోమవారం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో హర్ ఘర్ తిరంగా మరియు మేరీ మట్టి, మేరా దేశ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు 100 ఫీట్ల జాతీయ జెండాతో రంగశాయి పేట ప్రధాన కూడల్లు అయిన శంభుని పేట జంక్షన్, గవిచర్ల క్రాస్ నుండి ఊరేగింపుగా పాఠశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శేర్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అందుచేతనే విద్యార్థులకు చిన్నతనం నుండే దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్నిచేపడుతున్నామని చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది మహనీయుల కృషి ఫలితంగా మనం స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నామని అన్నారు. మరియు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి కూడా మన తల్లిదండ్రులను ఏవిధంగా అభిమానిస్తామో మన దేశాన్ని కూడాఅదేవిధంగా అభిమానించాలన్నారు. ఈ సందర్భంగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులు మద్దెల కుంట స్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎఫ్ బాధ్యులు పాల్గొన్నారు. మరియు పాఠశాల కరస్పాండెంట్ శేర్ల రజని ఉపాధ్యాయులు సాలేహ, ప్రవీణ్, సాయి కృష్ణ, శ్రీధర్, పూర్ణిమ, మానస తదితరులు పాల్గొన్నారు.