లో ఓల్టేజ్ సమస్యను నివారణ కోసం సబ్ స్టేషన్లు మంజూరు
జుక్కల్, జూలై 28, (జనం సాక్షి),
గ్రామాలలోని లోఓల్టేజ్ సమస్య నివారణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కొత్త సబ్ స్టేషన్లు మంజూరు చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండలం వజ్రకండి,మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామాలలోని 33/11కేవి సబ్ స్టేషన్లు మంజూరు కావడంతో కామారెడ్డి జిల్లా ఎన్ పిడిసిఎల్ ఎస్ఈ రమేష్ బాబు తో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి టెంకాయ కొట్టారు.ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు .గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ సమస్యను నివారించేందుకు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సబ్ స్టేషన్ నిర్మాణం కోసం కోట్లాది రూపాయలను మంజూరు చేస్తుందన్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్ నిర్మాణం కోసం రెండు కోట్ల 80 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసి రైతులు ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీపీ యశోద నీలు పటేల్, జడ్పిటిసి భర్త దాదారావు పటేల్, బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాయ గౌడ్, రామ్ పటేల్, మాధవరావు, బోల్లి గంగాధర్, పాకల విజయ్, కామారెడ్డి టెక్నికల్ డిఈ వెంకట రంగయ్య, ఎన్ పిడిసిఎల్ బాన్సువాడ డిఈ కామేశ్వరరావు, బిచ్కుంద ఏడిఈ రామకృష్ణ, జుక్కల్,మద్నూర్, బిచ్కుంద ఎఈ లు నరేందర్, అరవింద్, పవన్ పాల్గొన్నారు.