వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను 

– చంద్రబాబు అనుగ్రహిస్తే తన కుమాడిని ఎంపీగా పోటీచేయిస్తా
– ఎంపీలందరూ కరివేపాకులే!
– పవన్‌ కళ్యాణ్‌కు రాజకీయాలు ఎందుకు?
– అసెంబ్లీ వద్ద చిట్‌చాట్‌లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
అమరావతి, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే ఆలోచనలో లేనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వద్ద గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనని తెలిపిన ఆయన తన కుమారుడు పవన్‌ను పార్లమెంట్‌కు పంపించే ఆలోచనలో ఉన్నానని తెలిపారు.. చంద్రబాబు కనికరిస్తే మా వాడే కింగ్‌.. వాడికి పార్లమెంట్‌ కు పోటీచేయాలని ఉంది. బాబు కరుణిస్తే, అనంతపురం అభ్యర్థి నా కుమారుడే’ అని ప్రకటించారు. పార్లమెంట్‌లో చేయడానికి ఏముందన్న జేసీ.. ఎంపీలు కరివేపాకుల్లా మారారని, వారిని పలకరించే వారు కూడా ఉండరని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రవేశంపై స్పందించారు..  పవన్‌కళ్యాణ్‌ సినిమాలు తీసుకొనే కాడికి రాజకీయాలు ఎందుకని అన్నారు.  పవన్‌ రాజకీయ జీవితానికి ఆయన అన్న చిరంజీవి శాపంగా మారారని పేర్కొన్నారు. .పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన తమ పార్టీకి వచ్చే నష్టం ఏవిూ లేదన్నారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ఎంపీలందరూ కరివేపాకులేనని జేసీ ఒకింత నిర్వేదం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉంటాయని జేసీ తెలిపారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతి ఏంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తమ పార్టీలో చేరితో ప్రభాకర్‌చౌదరి కింద ఎందుకు పనిచేస్తారని, చంద్రబాబు కింద పనిచేస్తారని దివాకర్‌రెడ్డి చెప్పారు.

తాజావార్తలు