వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం
వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు ఖాయమని,ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడని, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులతో జిల్లకు సాగునీరు రైతుల అండగ తెలంగాణ ప్రభుత్వం ఎల్లపుడు ఉందని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు.
కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల గోకుల్ కన్వెన్షన్ హాల్ లో సోమవారం సంగారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ముందుగా సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పుల్లయ్య గారి ప్రభు గౌడ్, వైస్ చైర్మన్ గా ఖాజా ఖాన్ మరియు డైరెక్టర్ గా బ్యాగరి రాజు, మసూద్ బిన్ అబ్దుల్లాబస్ రవి, ధరావత్ హిరాలాల్, జగ్గరి రాజమల్లారెడ్డి, భోగ విజయలక్ష్మి, మేకల నరసింహులు, బానోత్ రవీందర్, చింతల సాయన్న, ముకురాల మనీష్ గౌడ్, నేనావత్ పరశురాం సింగ్, ఎం రాజారెడ్డి, ఆర్ మల్లారెడ్డి, పిఎసిఎస్ ఇరుగుపల్లి చైర్మన్, సంగారెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ అధికారి, ఏడి అగ్రికల్చర్ సంగారెడ్డి, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ లు పదాలు పదవి ప్రమాణ స్వీకారాన్ని చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగకుండా తెలంగాణ అభివృద్ధిలోముందుకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత కరెంటు తోపాటు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణతెలంగాణ ప్రభుత్వం అన్నారు. జిల్లాకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను మంజూరు చేయడమే కాకుండా ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో లక్సలా ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తుంది ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు ప్రధాన మంత్రి కావాలని.అందరు కలసి మళ్ళీ తెలంగాణాలో మళ్ళీ brs ను అధికారంలోకి తెద్దాం అని మంత్రి పిలుపు నిచ్చారు.
చింత ప్రభాకర్ మాట్లాడుతూ మన జిల్లా నుండి 5 అసెంబ్లీ స్థానాలను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామన్నారు. సంగారెడ్డి మార్కెట్ కమిటీ మంచిగా పనిచేసి పేరుతేచుకువాలన్నారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మెన్ పి. ప్రభుగౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి మార్కెట్ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తామన్నారు. వైస్ చైర్మెన్, డైరెక్టర్ల తో కలిసి వారి సలహాలు సూచనలతో మార్కెట్ అభివృని చేస్తామని హామీనిచ్చారు. తమపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మంత్రి హరీశారావుకు, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి భూపాలిరెడ్డి, ఎంపీ లు కొత్త ప్రభాకరరెడ్డి, బీబీ పాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, brs సీనియర్ నాయకులు ఆత్మకూరు నగేష్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ నరహరిరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మెన్ విజయలక్ష్మి, నాయకులు విజయందేర్ రెడ్డి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.