వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైకాపా, కాంగ్రెస్‌లు బంగాళాఖాతంలో కలసిపోతాయి
హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైకాపా, కాంగ్రెస్ పార్టీలు బంగాళాఖాతంలో కలసిపోతాయని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. జలయజ్ఞం పేరిట రూ. 80వేల కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ సర్కారు 80 ఎకరాలకు కూడా నీరివ్వలేక పోయిందని మండి పడ్డారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెదేపానేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు బోధనా ఫీజు చెల్లింపు, ప్రభుత్వాసుపత్రుల్లో శిశుమారణాలు లాంటి ప్రధాన సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట పేరట జిల్లాల్లో ఆటలాడుకుంటున్నారని దుయ్యబట్టారు.