వణికిస్తున్న ‘వార్దా’

 కోస్తా తీరాలను వణికిస్తున్న ‘వార్దా’ ముట్టడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమయింది. తుఫాన్‌ గమనాన్ని, అది తీరప్రాంతాలపై కలిగించే నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కోస్తాఅధికారులకు సెలవులు రద్దు చేసిన ఆయన.. తుఫాన్‌ నేపథ్యంలో తన గల్ఫ్‌ పర్యటనని రద్దు చేసుకొన్నారు. తుఫాను తీరుతెన్నులపై ఇస్రో నిపుణులు, వాdelhi-chennai-cyclone-risk-high-alert-beach-in-pondicherry-news-in-hindi-116111తావరణ శాఖ అధికారులను ఆరా తీశారు. తుఫాను నేపథ్యంలో తన గల్ఫ్‌ పర్యటన రద్దు చేసుకున్న తుఫాన్‌ ప్రభావిత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ‘‘తుఫాను సమాచారం అందిన క్షణంనుంచే ముందస్తు చర్యలకు అందరూ సంసిద్ధం కావాల’’ని ఆదేశించారు. విపత్తు సమయంలో పెద్దనోట్ల కారణంగా తీర ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నామని సీఎం తెలిపారు. దానికిగాను, ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి  అందిన రూ.1400కోట్లలో తుఫాను ప్రభావిత జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. 

తాజావార్తలు