వరదలచ్చి ఏడాది అయినా… వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పించడంలో పాలకులు విఫలం
జనంసాక్షి, మంథని: గత సంవత్సరం జూలై 12వ తేదీన కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా మంథని లో అకాల వర్షం కారణంగా వరద ముంపు కారణంగా మంథని మున్సిపల్ పరిధిలో, మంథని నియోజకవర్గంలో వరదల కారణంగా నీటిలో మునిగి పోయి గోడ కూలిన, కూలి పోయిన ఇండ్లకు, ఆస్తి నష్టం జరిగిన బాధితులకు అదేవిధంగా వరద ముంపు ద్వారా జరిగిన పంట నష్టం జరిగి నేటితో సంవత్సరకాలం అయినా కూడా ఇప్పటివరకు మంథని నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకుడు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే రైతులకు నిరుపేదలకు నష్టపరిహారం ఇప్పించడంలో విఫలం అయ్యారని మంథని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, మంథని బిజెపి పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో స్థానిక కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ నాయకుల వైఖరి పై వినూత్న రీతిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో చెవుల్లో పువ్వులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు 3800 రూపాయలు పరిహారం ఇప్పిస్తామని, కూలిపోయిన ఇండ్ల బాధితులకు 90,000 రూపాయలను ఇస్తామని, రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేపించి కూడా ప్రభుత్వం తరఫున పంట నష్టం పోయిన రైతులకు, అదే విధంగా ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైనటువంటి నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా ఒక్క రూపాయి కూడా ఇప్పించకుండా మంథని నియోజకవర్గ ప్రజల చెవులలో పువ్వులు పెడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలకు మాయ మాటలు చెప్పి కల్లబొల్లి మాటలతో మరొకసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఆరాటపడడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు. అకాల వర్షం కారణంగా వచ్చిన ఆపద కాలంలో ఇద్దరు నాయకులు స్థానికంగా ఉండి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనారని, గత 15 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉండి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజాసేవయే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాత్రమే ప్రజాక్షేత్రంలో ఉండి అప్పటి అకాల వర్షం కారణంగా వరద ద్వారా నష్టపోయిన నిరుపేదలను నిత్యవసర వస్తువుల పంపిణీ చేసి ఆదుకున్నారని అన్నారు. అంతేకాక వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి, నిరాశ్రయులైన నిరుపేదలను ఆదు కొని వారికి వెంటనే నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్ తో బిజెపి పార్టీ పక్షాన మంథని ఆర్డీవో కి అదేవిధంగా జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి వివిధ ఉన్నత అధికారులకు విన్నవించడం జరిగిందని తెలిపారు. నాయకులు ప్రభుత్వం ద్వారా నిరుపేదలకు, రైతులకు, నష్టపరిహారం ఇప్పించడంలో వీరిద్దరి నాయకులు విఫలమైనారని తెల్లారి లేస్తే కాంగ్రెస్ నాయకులను టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులను తిట్టుకోవడం తప్ప వీరికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రుపట్ల సునీల్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో నూతన రాజకీయ మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మంథని నియోజకవర్గ ప్రజలను బిజెపి నాయకులు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు ఎడ్ల సదాశివ్, ఉపాధ్యక్షులు రేపాక శంకర్, కాజీపేట సంతోష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బూడిద రాజు, ఎడ్ల సాగర్, వేల్పుల సత్యం, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్, గడ్డం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.