వరిలో వెదజల్లే పద్ధతితో అధిక లాభాలు
బాల్కొండ ఆగస్టు 07 (జనం సాక్షి ) బాల్కొండ మండలం లోని వన్నెల్ బి గ్రామంలో వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేసిన వరి పంటను పరిశీలించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు.
లాభాలు
1. ఒకే వ్యక్తి ఒక రోజులో 5 ఎకరాల వరకు ఈ వెదజల్లే పద్ధతి ద్వారా విత్తనం వేయవచ్చు. తద్వారా కూలీల సమస్యను నివారించుకోవచ్చు
2. నాటు వేయడానికి పట్టే ఐదు నుంచి 6000 రూపాయల పెట్టుబడిని తగ్గించుకోవచ్చు
3. ఈ పద్ధతి ద్వారా సాగు చేసిన వరి ఏడు నుండి పది రోజుల ముందు కోతకు రావడం జరుగుతుంది తద్వారా నీటిని మరియు సమయాన్ని పొదుపు చేసుకోవచ్చు
4. వెదజల్లే పద్ధతిలో వేసిన వరిలో కలుపు యాజమాన్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసిన 15 రోజులకు మరియు 30 రోజుల లోపల పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందులను పిచికారి చేసుకొని కలుపు ను నివారించుకోవాలి
5.గత సంవత్సరం ఈ పద్ధతి ద్వారా సాగుచేసిన వరిలో దిగుబడి కూడా పెరిగిందని రైతులు తెలిపారు
ఏఈఓ నిహారిక, రైతులు పాల్గొన్నారు.