వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని వడగట్టుకొని త్రాగాలి-వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రెండో వార్డు జ్యోతి నగర్, తిలక్ నగర్, కనకదుర్గ కాలనీ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డ్రైనేజీల దగ్గర నీళ్లు ఆగుతున్నాయా, వరద నీళ్లు ఎక్కడైనా జామైనాయాఅనితెలుసుకునేందుకు వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ వార్డులో పర్యటిస్తూ, ప్రజలకు సమస్యలు ఉన్నాయో, లేదో బుధవారం అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీళ్లు వేడి చేసి చల్లారిన తర్వాత వడపోసుకుని తాగాలని సూచించారు. కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్లొద్దని, కరెంటు వైర్లను ముట్టుకోకూడదని తెలిపారు. పరిశుభ్రత పాటిస్తూ వేడివేడిగా వండిన ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. జిటి హాస్టల్ ముందు వరద నీరు ఆగి తిలక్ నగర్ ఇండ్ల ముందు నీరు వస్తుందని సింగరేణి ఎస్ ఈ శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారు వెంటనే స్పందించి సానిటరీ డిపార్ట్మెంట్ వారిని పనిలో దించి నీళ్లు ఆగకుండా చూస్తానని తెలిపారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్న, జ్వరం, వాంతులు, విరోచనాలు ఉన్న వెంటనే తెలియజేస్తే ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి మందులు ఇప్పించడం జరుగుతుందని వార్డు ప్రజలకు తెలియజేశారు.