వర్షాభావ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని రెడ్ క్రాస్ సొసైటీని ఆదేశించిన గవర్నర్ తమిలిసై సౌందర రాజన్.
నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలీసై సౌందర రాజన్ రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూలు జిల్లా శాఖ సెక్రటరి సి.రమేష్ రెడ్డి,యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమర్ పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళ సై సౌందర రాజన్ మాట్లాడుతూ,వర్షాలు ఎక్కువగా ఉన్నందున సాదారణ జనజీవనం ఇబ్బంది పడుతున్నారని రెడ్ క్రాస్ వాలంటీర్లు తక్షణ సహాయం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.ఇళ్లు కూలిపోయి అత్యవసరం అయినవారికి టార్పలిన్ కవర్లు అందించాలన్నారు,తక్షణమే టెలి మెడిసిన్ సేవలను అరోగ్య శాఖ సహయంతో అందించలని సూచించారు.జిల్లాలోని అత్యవసర సేవలు అవసరం అయినవారికీ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.అత్యవసరం అయిన ప్రాంతాలలోని ప్రజలకు జూనియర్,యూత్ రెడ్ క్రాస్ వాలంటిర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నరు.ఈ సంద్భంగా రెడ్ క్రాస్ సెక్రటరి రమేష్ రెడ్డి మాట్లాడుతూ,గవర్నర్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర శాఖ సహకారంతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి/రెడ్ క్రాస్ ఛైర్మెన్ డా,సుధాకర్ లాల్ సూచనలు సలహాలతో జిల్లాలో వర్షాభావ ప్రభావిత ప్రాంతాలలో అత్యవసరం అయిన వారికీ తక్షణ సహాయం చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్దంగా ఉన్నామని తెలిపారు.