వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సెప్టెంబరులో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు ఇంతకు ముందు అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో మంచి వర్షాలు కురవవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్రంపై నెలకొన్న (ఎల్‌నినో) ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో మార్పులే దీనికి కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే ఐఎండీ తాజా సమాచారం ప్రకారం పసిఫిక్‌ మహాసముద్రంపై ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, అందువల్ల సెప్టెంబరులో వర్షపాతం మెరుగుకావచ్చని తెలుస్తోందని కేంద్ర వ్వవసాయ శాఖ కార్యదర్శి అశీష& బహుగుణ వెల్లడించారు. సెప్టెంబరులో విస్తారంగా వర్షాలు కురిస్తే కిందటేడాదికి, ప్రస్తుత ఏడాదికి సాగు విస్తీర్ణంలో నెలకొన్న అంతరం తగ్గవచ్చని అంచనావేస్తున్నట్లు బహుగుణ తెలిపారు.

తాజావార్తలు