విజయవంతమైన టీయూ డబ్ల్యూ జె (ఐజేయు) మహాసభలు.

 

-నూతన అధ్యక్షుడిగా గోలి సుదర్శన్ రెడ్డి

అచ్చంపేట ఆర్సి 14, ఆగస్టు ,జనం సాక్షి న్యూస్ : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహాసభలలో ఐజేయు రాష్ట్ర కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ నాయకులు పేపర్ శ్రీను ఎన్నికల అధికారి,ఎన్నికల పరిశీలకులు దత్తేంధర్ ల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీను మాట్లాడుతూ .. ప్రతి జర్నలిస్టుకు కనీస సౌకర్యాలు అయిన ఇల్లు వైద్యము తో పాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్య కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు.పాత్రికేయ వృత్తిలో వారికి రక్షణ వెనంటే ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన సీనియర్ పాత్రికేయులు గోలి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి పాత్రికేయులకు సంక్షేమం కొరకు హెల్త్ కార్డులు ఇళ్ల స్థలాలు ప్రమాద బీమా పూడ్ స్థాయిలో కల్పించేందుకు అందరి సమిష్టి సహకారంతో పోరాడి సాధించుకునేందుకు కృషి చేస్తానని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన యూనియన్ తరపున ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అకాల మరణం చెందిన, అనారోగ్యం చెందిన పాత్రికేయులకు యూనియన్లు పార్టీలు అని వివక్ష లేకుండా తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తానని తెలిపారు. త్వరలో జిల్లా పరిధిలో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి కంచర్ల శ్యాంసుందర్ మాట్లాడుతూ.. ప్రతి ప్రాత్రికేయునికి వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురైన వారికి అండగా ఉంటూ సంక్షేమం కొరకు తన శక్తికి మించి కృషి చేస్తానని తెలిపారు. మహాసభలో జిల్లాలోని నలుమూల ప్రాంతాలనుండి మండలాల నియోజకవర్గాల పాత్రికేయులు తమతమ అభిప్రాయాలు తెలియజేస్తూ ప్రసంగించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ టీయూ డబ్ల్యూ జె,ఐజేయు జిల్లా అధ్యక్షుడు దత్తే0ధర్,వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు కర్ణయ్య, రాష్ట్ర నాయకులు కృష్ణయ్య, కార్యవర్గ సభ్యులు కపిలవాయి పవన్ కుమార్ , ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది గాలిమూడి ప్రశాంత్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ లు సంబు చంద్ర శేఖర్ , గుందోజు స్వామి , హరీష్ ,ఎస్ ఎస్ బాబు, గెంటేలా బృందావన్, ఉస్మాన్, సహజనంద, సందు యాదగిరి, నాగయ్య, నరేందర్,ప్రముఖ సామాజిక కార్యకర్త జర్పాటి రాజు, మరియు జిల్లాలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

తాజావార్తలు