విజయవాడకు పచ్చని సొగబులు

ప్రత్యేక చర్యలకు శ్రీకారం
విజయవాడ,మే5(జ‌నం సాక్షి ): గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ¬దా దక్కడంతో ఇక దేశవిదేశీ ప్రముఖల రాకపెరుగనుంది. దీనికితోడు విజయవాడ కేంద్రంగా ఉండడంతో ఇక్కడ ప్రముఖుల రాక కూడా పెరిగింది. దీంతో విజయవాడను ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. రోడ్ల వెడల్పు, పచ్చదనం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. దుర్గమ్మ వారధి కూడా పూర్తయితే హైదరాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు ఇబ్బందులు తొలగనున్నాయి. మరోవైపు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని రహదారులను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈక్రమంలో రహదారులకు ఇరువైపులా, డివైడర్ల మధ్య పచ్చదనం పెంచేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన కృష్ణా పుష్కరాలకు, ఈ ఏడాది మొదట్లో ఫెర్రీలో నిర్వహించిన మహిళా పార్లమెంటీరియన్ల సదస్సుకు సీఆర్‌డీఏ అధికారులు మొక్కులు నాటారు. ఇదే రహదారికి ఇరువైపులా, డివైడర్ల మధ్య గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి పోషణ చేపట్టారు. మహిళా పార్లమెంటీరియన్ల సదస్సు సందర్భంలో ఏర్పాటు చేసిన పూల మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా అగ్నిమాపక యంత్రాలతో నీటిని అందించారు. అలాగే విజయవాడ కనకదుర్గ వారధి నుంచి బెంజిసర్కిల్‌, రామవరప్పాడు రింగ్‌, గన్నవరం విమానాశ్రయం వరకూ సీఆర్‌డీఏ అధికారులు గ్రీనరీ ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్‌ -మచిలీపట్నం (ఎన్‌హెచ్‌ 65) ఇబ్రహీంపట్నం-జగ్గయ్యపేట మధ్యలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అటవీశాఖకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 50 కిలో విూటర్ల మేర మొక్కలు నాటేందుకు నిధులు విడుదలయ్యాయి. దీంతో అటవీశాఖ ఈ రహదారి మధ్యలో మొక్కలు పెంపకానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ రోడ్డుకు ఇరువైపులా కిలో విూటరుకు 400 మొక్కలు నాటి సంరక్షించేందుకు అంచనా వేశారు. ఈ క్రమంలో వృక్షాలుగా ఎదిగిన తరువాత నీడనిచ్చే గానుగ, వేప, అవిశ, నిద్రగన్నెరు మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతోపాటు వీటి సంరక్షణకు నీటిని అందుబాటులో ఉంచుతారు. జంతువుల నుంచి రక్షించేందుకు కంచె ఏర్పాటు చేస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపడితేనే మొక్కలు వృక్షాలుగా ఎదిగుతాయి. ఇదిలావుంటే కృష్ణలంక 22వ డివిజన్‌లోని పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ హైస్కూల్‌ లోని వాకింగ్‌ ట్రాక్‌ పనులు పూర్తి చేయాలని సిపిఎం కమిటీ కోరింది.  డివిజన్ల పరిధిలోని ప్రజలకు ఎంతో అవసరమైన వాకింగ్‌ ట్రాక్‌ అధ్వానంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్కూల్‌ గ్రౌండ్‌లో కళాశాల నిర్మాణం సందర్భంగా లారీలు రాకపోకల వల్ల వాకింగ్‌ ట్రాక్‌ పూర్తిగా పాడైపోయిందన్నారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ట్రాక్‌ను బాగు చేయించకుండా ఉన్నందున డివిజన్లలోని ప్రజలు ఉదయాన్నే గ్రౌండ్‌లో వాకింగ్‌ కానీ, ఇతర వ్యాయామం చేయడానికి అనుకూలంగా లేదన్నారు. సత్వరమే వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు