ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) పరిపాలన సెప్టెంబర్ మొదటి వారం నుంచి విజయవాడ నుంచే నిర్వహించనున్నారు. నిన్నటి వరకు ఇక్కడ క్యాంపు కార్యాలయమే అనుకున్నా.. విజయవాడ లోని ‘ఆర్టీసీ భవన్’ నుంచే శాశ్వత పరిపాలన జరుగుతుందని బుధవారం ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు అధికారికంగా ప్రకటించారు. భవిష్యత్తులో సీడ్ క్యాపిటల్‌లో సెక్రటేరియట్‌కు దగ్గరగా ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ఆర్టీసీ భవన్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. సె ప్టెంబర్ మొదటి వా రం నుంచి ఆర్టీ సీ ఎండీ, ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్లు (ఈడీ), పేషీ సిబ్బంది ఇక్కడి నుం చే విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారులంతా వారంలో రెండు, మూడు రోజులు ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఆస్తుల విభజన పూర్తిగా జరిగే వరకు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లోని కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడికి రావటానికి ఉద్యో గులు ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారన్న దాని పై సర్వే నిర్వహించాల్సిందిగా ఎండీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు, ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ జరపగా తక్షణం 554 మంది ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావటానికి ఓకే చెప్పారు. దీంతో వీరందరికీ నవ్యాంధ్ర రాజధానిలో వసతి, కార్యాలయాల సదుపాయం కల్పించాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లకు 40 వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి వచ్చింది. పీఎన్‌బీఎస్ టెర్రస్‌పై 40 వేల చదరపు అడుగుల స్థలంలో విశాలమైన నిర్మాణాలు చేపట్టటానికి ఖాయం చేశారు. బస్‌స్టేషన్ టెర్ర స్‌పై ఎన్ని అంతస్థులు నిర్మించాలో ఖరారు చేసి వెంటనే టెండర్లు పిలవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పైస్థాయి నుంచి దిగువ స్థాయి వరకు ఉద్యోగుల కార్యాలయాలతో పాటు, అన్ని స్థాయిల వారికి వసతికి క్వార్టర్స్‌ను కూడా నిర్మించనున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ డిసెంబర్ మాసాంతానికి ఉద్యోగులందరినీ పూర్తి స్థాయిలో ఇక్కడికి తరలించాలన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఉన్నారు.
ఫినిషింగే మిగిలింది..
విజయవాడలో పీఎన్‌బీఎస్ మొదటి ఫ్లోర్‌లో తలపెట్టిన ఏపీఎస్‌ఆర్‌టీసీ ప్రధాన పరిపాలనా కార్యాలయం ఆర్టీసీ భవన్ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి. కేవలం ఫినిషింగ్ పనులే మిగిలి ఉన్నాయి. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న 6500 చదరపు అడుగుల స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ఎంచుకున్నారు. కార్యాలయానికి ప్రత్యేక లుక్ తీసుకురావటానికి లేపాక్షి సంస్థతో పార్టీషనింగ్, స్థానిక కాంట్రాక్టర్‌తో నిర్మాణ పనులు నామినేషన్ విధానంలో చేపట్టారు. ఎండీ కార్యాలయం, ఉన్నతాధికారుల మీటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కార్యాలయాలు, ఎండీ పేషీ వంటి వాటితో పాటు విశాలమైన వెయిటింగ్ హాల్, లాబీతో పాటు అనేక ఛాంబర్లను ఏర్పాటు చేశారు. ఆగస్టు 31 నాటికి పూర్తిస్థాయిలో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది.
అప్పుడు రూ.25 కోట్లు .. ఇప్పుడు రూ.98 లక్షలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నపుడు హైదరాబాద్‌లో బస్ భవన్ కార్యాలయ నిర్మాణానికి రూ. 25 కోట్లు ఖర్చయింది. 1992 – 2005 మధ్య కాలంలో అంటూ 13 ఏళ్ల పాటు నిర్మించారు. విభజన అనంతరం విజయవాడలో ఆర్టీసీ భవన్ నిర్మాణాన్ని కేవలం రూ. 98 లక్షల వ్యయంతో పూర్తి చేయటం గమనార్హం. జూన్ 10వ తేదీన పనులు ప్రా రంభిస్తే.. ఆగస్టు 31 నాటికి పూర్తి కా బోతోంది