విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరుగే బందును విజయవంతం చేయండి-విద్యార్థి సంఘాల నాయకులు పిలుపు.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 10. (జనంసాక్షి). విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 12న జరిగే పాఠశాలలు ఇంటర్ కళాశాల బందును విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఎస్ఎఫ్ఐ, ఏ ఐ ఎస్ ఎఫ్ , ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరు రంజిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకవైపు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దందా కొనసాగుతుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లకు సంబంధించి ఐదువేల 177 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. విద్యరంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బందులో జిల్లాలోని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో దొబ్బల ప్రవీణ్, రమేష్ చంద్ర, అనిల్, రాకేష్ పాల్గొన్నారు.

తాజావార్తలు