విశాఖలో జాతీయ ఆరోగ్య ఫెయిర్‌

విశాఖపట్నం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆరోగ్య ఫెయిర్‌-2017ను కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద్‌ యశోనాయక్‌ శుక్రవారం ప్రారంభించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఫెయిర్‌ ఈ నెల 8 నుంచి 11 వరకు 4 రోజులపాటు జరగనుంది. ఆయుర్వేదం, యునాని, యోగా, సిద్ధ, ¬మియోపతి వైద్యవిధానాల్లో ఇక్కడ సేవలు అందిస్తారు. ఇందుకు సంబంధించి 70 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.ఉచిత వైద్య సేవలతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేయనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశీయ వైద్య విధానాలను అభివృద్ధి చేసే పక్రియలో భాగంగా కేంద్ర ఆయుష్‌శాఖ ఆరోగ్య ఫెయిర్‌ నిర్వహిస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య, సుజాతశర్మ, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, వివేక్‌ సైగల్‌, అనిల్‌ ఖైతాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏయూను సందర్శించిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్రసింగ్‌ దనోవా శుక్రవారం ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏయూ ప్రధాన పరిపాలనా భవనం వద్ద దనోవాకు సైనిక వందనంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావుతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కొద్దిసేపు చర్చించారు. అనంతరం ఆచార్యులతో పరిశోధన ప్రాజెక్టులపై సవిూక్షించారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని నానో టెక్నాలజీ విభాగాన్ని ఆయన సందర్శించారు.

తాజావార్తలు