విశాఖ విూదుగా ప్రత్యేక రైలు

విశాఖపట్టణం,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.  తిరుచురాపల్లి నుంచి హౌరాకు సవిూపంలోని సంత్రగచ్చి వరకు రాకపోకలు సాగించేలా ప్రత్యేక రైలు నడపుతున్నట్లు వాల్తేర్‌ డివిజనల్‌ అధికారులు  తెలిపారు. ఇది విశాఖ విూదుగా నడుస్తుందన్నారు. తిరుచురాపల్లి నుంచి విశాఖ విూదుగా సంత్రగచ్చి వెళ్లే  2వ తేదీ నుంచి జూన్‌ 25 వరకు ప్రతి శనివారం సాయత్రం 05:30 గంటలకు తిరుచురాపల్లి స్టేషన్‌లో బయలుదేరి మర్నాడు ఆదివారం మధ్యాహ్నం 01:43 గంటలకు దువ్వాడ వస్తుంది. తిరిగి 01:45 గంటలకు బయలుదేరి మర్నాడు సోమవారం తెల్లవారుజామున 04:30 గంటలకు సంత్రగచ్చి వెళుతుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్‌ 4 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 02:10 గంటలకు బయలుదేరి మర్నాడు మంగళవారం తెల్లవారుజామున 03:23 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి 03:25 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:20 గంటలకు తిరుచురాపల్లి చేరుకుంటుంది. ఈ రైలుకు ఒక సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, 10 స్లీపర్‌, నాలుగు సాధరణ బోగిలు ఉంటాయి. దీనికి రిజర్వేషన్‌ సౌకర్యం కూడా ఉందన్నారు.

తాజావార్తలు