విషాదం నింపిన వినాయక నిమజ్జనాలు

వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు దుర్మరణం

విజయవాడ,ఆగస్ట్‌28

వినాయక నిమజ్జనాలు విషాదంతో మొదలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో నలుగురు యువకులు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు.

ప్రకాశం జిల్లాలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపట్నం మండలం ఈతముక్కల సముద్ర తీరంలో గణెళిష్‌ నిమజ్జనం సందర్భంగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురు యువకులు మృతిచెందారు. సముద్రంలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కందులూరు గ్రామానికి చెందిన రాంబాబు (26), కృష్ణమూర్తి (27) బైక్‌పై వెళుతున్నారు. అదే దారిలో అప్పటికే వినాయకుడి నిమజ్జనంలో పాల్గొని ఒంగోలుకు చెందిన ముగ్గురు యువకులు అశోక్‌ (20), పవన్‌ (14), శివశంకర్‌ తిరిగి వస్తున్నారు. అతివేగంగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో సంఘటనా స్థలిలోనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. శివశంకర్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కందులూరు, ఒంగోలులో విషాదాన్ని నింపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా తడ మండలం అండగుండాలలో విషాదం చోటుచేసుకుంది. గణెళిశ్‌ నిమజ్జనానికి వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలం కాల్వబుగ్గ వద్ద వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం చేస్తుండగా విగ్రహం విూద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బేతంచర్ల మండలం సీతారాంపురం వాసిగా గుర్తించారు.

తాజావార్తలు