విస్తృతంగా ఆరోగ్య శిబిరాలు, డ్రైడే కార్యక్రమాలు

విస్తృతంగా ఆరోగ్య శిబిరాలు, డ్రైడే కార్యక్రమాలు

టేకులపల్లి, ఆగస్టు 8( జనం సాక్షి ): టేకులపల్లి మండల వ్యాప్తంగా గ్రామాలలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది విస్తృతంగా ఆరోగ్య శిబిరాలు డ్రైడే కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశానుసారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ పరిధిలో గల అన్ని గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించడంతో పాటు, డ్రై డే కార్యక్రమాలు ముమ్మరం చేపట్టారు. తుమ్మలచలక, రోడ్డు గుంపు, కొత్త తండా, చింతోనిచలక, లక్యా తండా, బొమ్మనపల్లి, దుబ్బ తండ,కొప్పురాయి గ్రామాలలో ఆరోగ్య సమావేశాలు వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించారు. లార్వా ఉన్న చోట యాంటీ లార్వా ఆపరేషన్ లో తీమోఫోస్ చల్లించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని, పరిశుభ్రమైన ఆహారం, త్రాగు నీటిని మాత్రమే ఈ వర్షాకాలం తీసుకోవాలని ప్రజలకు వైద్య సిబ్బంది సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలతో పాటు 132 రకాల రక్త పరీక్షలు టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని, అవసరమైన వారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు త్వరగా పేరు నమోదు చేసుకుని టీకా, ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలని రక్త హీనత పోషకాహార లోపం నివారణ కు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న న్యూట్రిషన్ కిట్స్ లో మంచి పౌష్టికాహారం గల పదార్దములు ఉన్నాయని వాటిని వాడుకోవడం ద్వారా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని, అదేవిధంగా చక్కెర వ్యాధి, రక్త పోటు ఉన్న వారు నెల నెలా ప్రభుత్వ సిబ్బందిచే ఉచిత పరీక్షలు చేయించుకొని ఉచితంగా అందజేసే మందులు వాడాలని వైద్య సిబ్బంది ప్రజలకు సూచించ�

తాజావార్తలు