వీణాధరిలో నమూనా పోలింగ్
చొప్పదండి, ఆగస్టు 12 (జనం సాక్షి): మండల కేంద్రంలోని వీణాధరి పాఠశాలలో కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం నమూనా పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆవశ్యకతను మరియు ఎన్నికల ప్రక్రియను తెలియజేసేందుకు విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, కావున ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు.ఎన్నికల్లో హెడ్ బాయ్ గా, భీమనాతిని కరుణాకర్, హెడ్ గర్ల్ గా ఎలిగేటి నందితాదేవిని విద్యార్థులు ఎన్నుకున్నారని పేర్కొన్నారు .అనంతరం ఎన్నికైన విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కే. మల్లేశం, ఆంజనేయులు, చంద్రశేఖర్, మహేందర్, మధుసూదన్, శైలజ, సత్యనారాయణ రెడ్డి, సీమాత బస్సు, సరిత, కవిత, దీపిక, సాహితీ, అనూష, సుప్రియ, సువర్ణ, లక్ష్మీ మాల, తేజ, లావణ్య, హరీష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.