వీరశైవ లింగాయతులను ఓబీసీ లో చేర్చేందుకు చేసే ప్రయత్నం లో అభివృద్ధి
రానున్న శీతాకాల సమావేశాల్లో చర్చకు రావచ్చన్న నేతలు
ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం ఉండి సిఫారసులు
వీర శివలింగాయతులతోపాటు ఇంకా 40 కులాలను ఓబీసీ లోకి
ప్రయత్నం ముమ్మరం చేసిన బీబీ పాటిల్ ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రర పాటిల్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 1
వీరశైవ లింగాయతులను ఓబీసీ లో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నం లో అభివృద్ధి సాధించినట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రర పాటిల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రానున్న శీతాకాల సమావేశాల్లో ఈ విషయం చర్చకు రావచ్చునని , త్వరలో వీరశైవ లింగాయత్ లు ఓ బీసీలుగా ఫలితాలను అనుభవిస్తారని వివరించారు.
జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో స్థానిక శివబాంకటాల్లో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సమాజం జిల్లా అధ్యక్షులు మధు శేఖర్ ప్రసాది అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓబిసి సాధన సభ్యులు శుభప్రద పాటిల్ పాల్గొని మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వీర శివలింగాయతులను ఓబీసీ లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాలుగా చర్చిస్తున్నారన్నారు. పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు. ఇప్పుడు ఓబీసీ లోకి చేర్చేందుకు కమిషన్ సభ్యులు అంగీకరించారని, వారి సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి పంపనటువంటి తెలిపారు. అనంతం రానున్న శీతాకాల సమావేశాల్లో దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని పాటీలు వివరించారు.
వీరశైవ లింగాయతులే కాదు వారితో పాటుగా ఇంకా కొన్ని కులాల వారు అనగా తెలంగాణ ఏర్పడక ముందు 27 కులాలు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంకో 13 కులాలు మొత్తం కలిపి 40 కులాల వారిని కూడా ఓబీసీ లో కలపాలని తాము ప్రయత్నం చేస్తున్నామని పాటిల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు జహీరాబాద్ సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సులుగంటి సిద్దేశ్వర, చంద్రకాంత్ పాటిల్, మల్లికార్జున్, శివరాజ్ పాటిల్, వీర మల్లేష్, పట్కోల చంద్రశేఖర్, రవికుమార్, మంజుల కౌలాస్, గొర్రె గట్టు శారద, పోలీస్ సంతోష్ పాటిల్, బత్తుల శ్రీనివాస్, నాగరాజ్, వినయ్, హనుమప్ప, శ్రీశైలం పాటిల్, రాజ్ కుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.