వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
రోడ్డు ప్రమదాంలో ఇద్దరు, పడవబోల్తా పడి మరో ఇద్దరు మృతి
నెల్లూరులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలికల దుర్మరణం
అమరావతి,నవంబర్30(జనంసాక్షి): వేర్వేరు ప్రమాదాల్లో కనీసం ఆరుగురు దుర్మరం చెందారు. వివ ఇధ జిల్లాల్లో జరిగిన ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఐషర్ వాహనం బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన గురువారం ఉదయం అనంతపురం
జిల్లాలో జరిగింది. పెనుగొండ మండలం గుట్టూరు గ్రామానికి సవిూపంలో ఐషర్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న సోమరాజు, లక్ష్మన్న అనే యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే మరో 5గురికి గాయాలయ్యాయి. మృతులు చత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్టాన్రికి చెందిన కూలీలుగా గుర్తించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే విశాఖ జిల్లాలో గురువారం పడవ బోల్తా కొట్టిన సంఘటనలో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం బంగారయ్యపాలెం దగ్గర సముద్రంలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు పడవ సాయంతో వెళ్లారు. అయితే… ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు మృతిచెందగా మరో నలుగురు గల్లంతయ్యారు. సమాచారమందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో బీచ్‌లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఇద్దరు బాలికలు మృతిచెందారు. ఈ విషాద సంఘటన గురువారం నెల్లూరు జిల్లాలో జరిగింది. వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద గల బీచ్‌లో రమ్య(13), రోషిణి(14) అనే బాలికలు ఈత కొట్టేందుకు వచ్చారు. అయితే… ప్రమావశాత్తూ నీటిలో మునిగి చనిపోయారు. మృతులు కోట మండలం వీరారెడ్డిసత్రానికి చెందినవారుగా గుర్తించారు. బాలికల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. హైవేపై ట్రాక్టర్‌ను యాసిడ్ లారీ ఢీకొంది. ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. జరుగుమిల్లి మండలం వావిలేటిపాడుకు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టారు.