వైఎస్సార్ చిరస్మనీయుడు : హరివర్ధన్ రెడ్డి
:శామీర్ పేట్, జనం సాక్షి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి సందర్భంగా తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్ లో
తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… మాట తప్పని,మడమ తిప్పని,ఓటమెరుగని మహానేత డాక్టర్ వైయస్సార్ అని , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప మహానుభావుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.రైతులకు ఉచిత విద్యుత్,రైతులకు విద్యుత్ బకాయిలు మాఫీ,రైతులకు రుణాలు మాఫీ,రైతాంగానికి సరైన సమయంలో సబ్సిడీ పైన విత్తనాలు అందివ్వడం,మహిళలకు పావుల వడ్డీకి రుణాలు,వృద్ధులకు వితంతులకు అర్హులైన వారందరికీ ప్రతి నెల 200 వందల పింఛన్,వికలాంగులకు 500 వందల పింఛన్,అభయ హస్తం కింద 60 సంవత్సరాల మహిళలకు పింఛన్లు అందించినారు,రెండు రూపాయలకే కిలో బియ్యం,జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టి లక్షలాది ఎకరాలకు రైతాంగానికి సాగునీరు అందించినారు,108 అత్యవసర అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి వందలాదిమంది నిరుపేదల ప్రాణాలు కాపాడన్నారు.104 అంబులెన్స్లు ఏర్పాటు చేసి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిరుపేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయించినారు,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలు పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే విధంగా చేసినారు.ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్షలాదిమంది నిరుపేదలకు కోట్లాది రూపాయలు అందించారు.రాష్ట్రంలో అవసరం ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్,డిగ్రీ,పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినారు,ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదివి కలెక్టర్లు,డాక్టర్లు,ఇంజనీర్లు,ఇంకా తదితర రంగాలలో రాణించాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టినారు,ఇందిరమ్మ ఇండ్ల పథకంతో రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టించినారు,
రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించినారు,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాని కూడా ప్రారంభించి దానితోపాటు స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం మధ్యాహ్నం భోజనాన్ని కూడా విద్యార్థులకు అందించే పథకాన్ని ప్రవేశపెట్టినారు,మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించినారు,మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించినారు,నిరుద్యోగ యువతకు లక్షలాదిమందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించినారు,ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు కార్పొరేషన్ లోన్లు అందించినారు,రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను నిర్మించినారు,ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసినారు,మెట్రో రైలు కోసం కృషి చేసినారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,శంకర్ గౌడ్,కొండల్ రెడ్డి,మురళి గౌడ్,యాదగిరి,శ్రీనివాస్ యాదవ్,మురళి గౌడ్,లక్ష్మీనారాయణ,ధర్మారెడ్డి,హరిగోపాల్,రవీందర్ గౌడ్,దర్శన్ గౌడ్,భరత్ సింగ్,నారాయణ,రామచంద్ర యాదవ్,మల్లేష్ యాదవ్,హరిగోపాల్,పాండు, బిక్షపతి,జగన్,మల్లేష్ గౌడ్,రవీందర్ గౌడ్,తదితరులు,పాల్గొన్నారు.
8ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు