శాసనభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

` నేడు అధికారిక ప్రకటన
` ఒకే నామినేషన్‌ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం
` మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌
` నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటి సీఎం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది.ఒకే నామినేషన్‌ రావడంతో ప్రసాద్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్‌ ఎన్నికపై ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటన చేయనున్నారు.శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. అంతకుముందు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి వికారాబాద్‌ ఎంఎల్‌ఎ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శికి ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట సిఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి మల్లు,పలవురు కాంగ్రెస్‌ మంత్రులు,ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎలు, మాజీ మంత్రి కెటిఆర్‌ తదితరలున్నారు. ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రతిసాదిస్తూ కెటిఆర్‌ నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వెళ్లి మాజీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం స్పీకర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి కేటీఆర్‌ను శ్రీధర్‌ బాబు ఆహ్వానించారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వెళ్లి స్పీకర్‌ నామినేషన్‌ పత్రాలపై కేటీఆర్‌ సంతకం చేశారు. మరోవైపు శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొత్తగా కొలువుదీరనున్న శాసనసభకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున స్పీకర్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సహజంగా అధికార పార్టీ స్పీకర్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతుంటారు. గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా నియమితులైతే తెలంగాణ రాష్టాన్రికి తొలి దళిత స్పీకర్‌ కానున్నారు. ప్రస్తుత శాసన సభలో అత్యధిక మంది సభ్యులు అగ్రకులాలకు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. సభలో వారికి మాట్లాడే అవకాశం ఇచ్చే, వారిని నియంత్రించే అధికారాలు కలిగిన స్పీకర్‌ పదవిని దళిత నేతకు ఇస్తున్నామన్న భావనను ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు

( నేటినుంచే తెలంగాణ అసెంబ్లీ
` స్పీకర్‌ ఎన్నికతో తొలిరోజు సమావేశం
` రేపు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
` బిఆర్‌ఎస్‌ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం!
హైదరాబాద్‌(జనంసాక్షి):  స్పీకర్‌ ఎన్నికతో తెలంగాణ  ఆసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికార పార్టీగా కూర్చోబెట్టిన ప్రజలు.. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల స్థానాలు మారినా ఇరుపార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ప్రతివిమర్శలు తప్పేలా లేవు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నేతలు నిలదీస్తామన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని హరీష్‌ రావు, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని కెటిఆర్‌ విమర్వలు గుప్పించారు. ఇకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ 64 మంది సభ్యులతో, ఒక్క సీపీఐ ఎమ్మెల్యే మద్ధతుతో, ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మరో వైపు 39 ఎమ్మెల్యేలతో గులాబీ పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలతో కమలం పార్టీ, 7 గురు ఎమ్మెల్యేలతో ఎం.ఐ.ఎం పార్టీ ఈ కొత్త అసెంబ్లీలో కొలువు తీరనున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌ టార్గెట్‌గా పని చేయనున్నాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి అధికార పక్షంగా అసెంబ్లీలో వ్యవహరించింది. రెండో టర్మ్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష పార్టీయే లేని పరిస్థితిని కల్పించుకున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. 2014లో కాంగ్రెస్‌, టీడీపీలో మెజార్టీ ఎమ్మెల్యేలు  అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో అధికార పార్టీ హోదాలో ఉన్న టీఆర్‌ఎస్‌ కు అసెంబ్లీలో ఎదురే లేని పరిస్థితి. అయితే శాసన మండలిలో మాత్రం విపక్షాల సభ్యులు ఎక్కువ ఉండటంతో ఆయా అంశాలపై ఎక్కువ సమయం చర్చ జరిగేది. కాని శాసనసభలో మాత్రం ఏకపక్ష చర్చ సాగేది. 2018లోను అదే పరిస్థితి. 2018లోను కాంగ్రెస్‌ ది అదే పరిస్థితి. రేవంత్‌ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వంటి నేతలు ఆ ఎన్నికల్లో ఓడిపోగా, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌ బాబు వంటి నేతలు కొంత ప్రయత్నించినా అధికార పార్టీని నిలదీసే పరిస్థితి ఏ మాత్రం రాలేదు. మరోవైపు రెండు పర్యాయాలు అసెంబ్లీలో ఎదుటివారిని మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వలేదు. అప్పటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా కనుమరుగయింది. వామపక్షాలదీ అదే పరిస్థితి. బీజేపీ ఒక్క సభ్యుడు  మాత్రమే గెలిచినా, చివరకు వారి బలం ముగ్గురికి చేరుకుంది. కాని అధికార టీఆర్‌ఎస్‌ కు మాత్రం ఏ పార్టీ ఇబ్బంది పెట్టలేని పరిస్థితి ఉండేది. కాస్తో కూస్తో మిత్రపక్షంగా ఉన్న ఎం.ఐ.ఎం పార్టీనే ప్రజా సమస్యలపై, ఓల్డ్‌ సిటీ అభివృద్ధిపై కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండేది. కాని ఈ దఫా 39 సభ్యులతో బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా ఉంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ను దూకుడుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ దఫా అధికార పార్టీకి అసెంబ్లీలో కొంత ప్రతిఘటన పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. అయితే బిఆర్‌ఎస్‌ అక్రమాలపై సిఎం రేవంత్‌  దులిపే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బయట వారు చేస్తున్న విమర్వలపై గట్టిగానే సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం వ్యవహారం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, డబుల్‌ ఇళ్లు తదితర అంవాలపై ఏమాత్రం చాన్స్‌ తీసుకోకుండా దునుమాడే అవకాశం ఉంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎదుర్కోవడం అంత సులువేం కాదు. 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌ గట్టి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉన్నా అవినీతి అక్రమాల పాపాలు వెన్నాడుతుంటాయి. అయితే  8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎం.ఐ.ఎం ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌ గా, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, కరీంనగర్‌ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు. తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేత హోదాతో కేసీఆర్‌ అసెంబ్లీలో అడుగుపెట్ట నున్నా..ఆస్పత్రికే పరిమితం కావడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేదు. తన ఫాం హౌస్‌ లో కేసీఆర్‌ జారి పడటం, తుంటి భాగం విరగడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్‌ జరగడంతో దాదాపు మరో నెల రోజుల పాటు కేసీఆర్‌ బయటకు రావడం సాధ్యపడని పరిస్థితి నెలకొంది. సీఎంగా రేవంత్‌ రెడ్డి ఉన్న సభ ఎలా జరగనుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సమావేశాల తొలిరోజే శాసన సభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నుండి గెలిచిన వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్పీకర్‌ గా నామినేషన్‌ వేశారు. ఈ సమావేశాల్లో ఆయన స్పీకర్‌ గా ఎన్నికవనున్నారు. తదనంతరం జరిగే బీఏసీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చించాల్సిన ఎజెండా, ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న దానిపై స్పష్టత రానుంది. 14న సమావేశాల తరవాత 15న గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈ క్రమంలో తరవాత ఒకటి రెండురోజులు మాత్రమే సమావేవాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్‌ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌, గత పదేళ్లుగా అధికార పార్టీగా పాలన సాగించిన బీఆర్‌ఎస్‌ ను  ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.  ఎన్నికల్లో ఇచ్చిన హవిూల అమలుపై బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ ను పట్టుపట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇష్టారీతిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు హవిూలు ఇచ్చిందని అందుకు నిధులు ఎలా తెస్తారో.. ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీల పథకాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ సైతం రాష్ట్రంలో పదేళ్లుగా సాగిన గులాబీ పాలనపైన విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. ªూష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైన ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసి బీఆర్‌ఎస్‌ ను ఇరుకునపెట్ట వచ్చని తెలుస్తోంది. అప్పులు చేసిన తీరుపైన , విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీఆర్‌ఎస్‌ ను కార్నర్‌ చేసేందుకు  కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ
అసెంబ్లీ, మండలిలు ఒకేచోట: సీఎం రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): పార్లమెంట్‌ నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ,శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్‌ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్‌ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీ పెంచాలన్నారు. అసెంబ్లీ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. మెంబర్స్‌ ఉదయం పూట వాకింగ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఇదిలావుంటే జూబ్లీహాల్‌లో ఉన్న మండలిని పాత అసెంబ్లీ భవనంలోకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇరు సభలు ఒకే దగ్గరగా ఉంటాయి. విభజన సమయంలో పాత అసెంబ్లీ భవనం ఎపిఅసెంబ్లీగా ఉపయోగించారు. ఇకపోతే జూబ్లీహాలను ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు వినియోగించేవారు. ఇప్పుడు దానిని మళ్లీ యధాతథంగా పునరుద్దిరించనున్నారు.