శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం
కర్నూలు: రెండు నెలల విరామం తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 2, ఎడమ గట్టు కేంద్రంలో 2 యూనిట్లలో ఉత్పత్తిని ప్రారంభించారు. 834 అడుగుల నీటిమట్టం తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 838.70 అడుగులుగా ఉండటంతో విద్యుదుత్పత్తికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి 21,761 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.