శ్రీ దండు మారమ్మ ఆలయంలో ప్రత్యక పూజలు నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి
పాల్గొన్న ముప్పిడి గోపాల్, మర్రి, ఆర్కే,మాజీ ఎమ్మెల్యే, చైర్మన్లు, కార్పొరేటర్
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 23 సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బాలoరాయిలోఉన్న శ్రీ దండు మారమ్మ దేవాలయంలో ఆషాడ, శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, పాల్గొని శ్రీ దండు మారెమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మండప నిర్మాణ కమిటీ చైర్మన్,గోపురం అభివృద్ధి కమిటీ,మరియు బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కంటోన్మెంట్ టిడిపి ఇంచార్జ్ ముప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు బంగారు బోనం సమర్పించు మొక్కలు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానికంగా నివసించే మహిళలు ఆలయానికి విచ్చేసి పూజలు చేసి బోనాల సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు భక్తులు అత్యంత ఉత్సాహంతో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు బోనాలుఅమ్మ వారిని దర్శించుకొని పూజల నిర్వహించారు. అన్నా నగర్ బాలమరాయి అంబేద్కర్ నగర్, రసూల్ పుర, తదితర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, పెరుముళ్ళ దేవస్థాన కమిటీ సభ్యుడు రేవతి నరేష్, అలాగే వివిధ పార్టీ నాయకులు, కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్,కంటోన్మెంట్ బి ఆర్ ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు, కార్పొరేషన్ చైర్మన్లు మన్నే కిశాంక్, గజ్జల నాగేష్, జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు,బిజెపి నుంచి కార్పొరేటర్ దీపికా నరేష్, కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ,బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్, ఆరేపల్లి పరశురాం, మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్. శ్రీనివాస్, సుస్మిత, దేవేందర్, సాదా కేశవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి. ఎన్. శ్రీనివాస్ ,తేజ్ పాల్, ముప్పిడి మధుకర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.