శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి చీరల‌ వేలం – వేలం ద్వారా రూ. 58,370 ఆదాయం


జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన (సారె) చీరలను తిరిగి భక్తులు పొందడం కోసం ఆలయ ఆవరణలో వేలం విక్రయించగా రూ. 58,370 ఆదాయం వచ్చినట్లు, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సుజాత, మేనేజర్ రాజ్ కుమార్ లు మంగళవారం తెలిపారు. మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తో పాటు పలువురు మహిళా భక్తులు అమ్మవారి చీరలను విరివిరిగా కొనుగోలు చేశారు. మంథని ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా పుట్ట శైజల అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మార్పాక చంద్రకళ తో పాటు డైరెక్టర్లు పోతరాజు వెంకటలక్ష్మి సమ్మయ్య, బత్తుల విజయలక్ష్మి, కాయితోజు సమ్మయ్య, బడికల శ్రీనివాసు, జూనియర్ అసిస్టెంట్ బెజ్జాల రవి కిరణ్ లు పాల్గొన్నారు.

తాజావార్తలు