సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు10(జనంసాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం ఐడి ఓసిలోని కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో లక్ష రూపాయల చెక్కుల పంపిణీ, దళిత బంధు, గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకరణ, క్రీడాకారుల కిట్స్ పంపిణీ వంటి కార్యక్రమాలను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో లక్ష రూపాయల పథకం కింద 11 382 దరఖాస్తులు స్వీకరించి 11 260 దరఖాస్తులను పరిశీలించడం జరిగిందన్నారు నియోజకవర్గానికి 300 చొప్పున కేటాయించాల్సి ఉండగా మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు300, అలాగే డోర్నకల్ కు 300, మరో వంద ఇల్లందు నియోజకవర్గము లోని గార్ల, బయ్యారం మండలాలలో ని ప్రజలకు జిల్లాలో మొత్తంగా 700 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగనున్నదన్నారు. 15 రోజుల్లో పంపిణీ చేసి 30 రోజుల్లోగా ఫోటోలను తీయించి బిల్స్ తో సహా ఆన్లైన్ ద్వారా పంపాలన్నారు. మైనారిటీ వారికి 120 కేటాయించడం జరిగిందన్నారు. దళిత బంధు పథకం పై మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల వారీగా శాసనసభ్యుల సహకారంతో ప్రత్యేక అధికారులు అర్హుల జాబితా రూపొందించి అందచేయాలన్నారు. గతంలో 301 మందికి దళిత బందుతో ప్రయోజనం పొందినట్లు తెలియజేశారు. గృహలక్ష్మి కింద లబ్ధిదారులు అందజేసిన దరఖాస్తుల పరిశీలన కొరకు పర్యవేక్షణ బృందాలు నియమించాలని లబ్ధిదారులు తెల్లకాగితంపై దరఖాస్తు చేసిన స్వీకరించాలన్నారు అర్హులైన వారికి ఇల్లు ఉండరాదు అన్నారు ఇంటి స్థలం ఉండి రేషన్ కార్డు కలిగి ప్రభుత్వ నియమ నిబంధనల ఉత్తర్వులు 59 క్రింద లబ్ధిదారులై ఉండాలన్నారు రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తించాలన్నారు దారిద్య రేఖ దిగువున ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదని కలెక్టర్ తెలియజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ బృందం జిల్లాలోని 20 గ్రామాలలో పర్యటించినట్లు తెలియజేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా 9వ విడత హరితహారం లో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తూ అందుకు సంసిద్ధంగా ఉండాలని ప్రణాళికపరంగా మొక్కలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 650 తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు 478 క్రీడాకారులకు కిట్స్ వచ్చి ఉన్నాయని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భద్రపరిచి అధికారులు యూత్ అసోసియేషన్ లను ఏర్పాటు చేసి ఉపయోగించుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీసీఈఓ రమాదేవి, డిఆర్డిఏ పిడి సన్యాసయ్య, బీసీ సంక్షేమ అధికారి నరసింహ స్వామి, మైనారిటీ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాలరాజు జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి అనిల్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారిని నర్మద, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.