సంగారెడ్డిలో కేసీఆర్ త్రిపటానికి పాలాభిషేకం
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైనది
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, ఆగస్టు 1 ::
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైనదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.
మంగళవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు తెలంగాణ సీఎం కేసిఆర్ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులతో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం హాజరైనారు.
ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర క్రియాశీలకంగా ఉండేది అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మికుడిని గుర్తు పెట్టుకున్నారు. అందుకే ఆర్టీసీ కార్మికులను తన పక్కన చేర్చుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పట్నం మాణిక్యం తో పాటు, ఆర్టీసీ సంగారెడ్డి డిఎం, ఆర్ఎం మరియు ఆర్టీసీ కార్మిక ఉద్యోగస్తులు పాల్గొన్నారు