సమన్యాయంతో సమస్యలపై పోరాడి నియోజకవర్గ అభివృద్ధి దేయంగా కృషి చేయాలి -నానవత్ భూపాల్ నాయక్ కిషన్ పరివార్ సంస్థ వ్యవస్థాపకులు
-కాంగ్రెస్ పార్టీ నేతలు రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్ నా మిత్రులే
-ప్రతి ఒక్కరు రైతుల గురించి మాట్లాడతారు కానీ
రైతుల పక్షాన నిలబడింది ఎవరు!
డోర్నకల్/ ఆగస్టు 1, జనం సాక్షి న్యూస్: సమన్యంతో ప్రజా సమస్యలపై పోరాడి నియోజవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కిసాన్ పరివార సంస్థ వ్యవస్థాపకులు ననావత్ భూపాల్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజవర్గ కేంద్రంలోని మున్నేరు వాగు శివారు శివాలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం డెవలప్మెంట్ కోసం లక్ష 16 రూపాయలు చెక్కుల రూపంలో ఆలయ ప్రధాన పూజారి గణేశ్యాం కు అందజేశారు. శివాలయం ఆవరణలోదేవా వృక్షాన్ని నాటారు.అనంతరం తను అనుచరులు, ప్రజలతో కలిసి ర్యాలీగా మున్సిపాలిటీ కేంద్రంలోని ముత్యాలమ్మ తల్లి ని దర్శించుకుని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ప్రధాన కూడాలిలో పలు దుకాణం దారులతో ముచ్చటించారు. అనంతరం రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే పుట్టాను దేశమే నాదన్నప్పుడు నియోజవర్గం కూడా నాది కాదా కురవి మండలం చంద్యా తండా గ్రామంలో 100 ఎకరాల భూమి, ఫామ్ హౌస్ ఉంది అలాంటప్పుడు నాన్ లోకల్ ఎలా అవుతాను నేను కూడా లోకల్ నే అని సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, కిసాన్ పరివార్ సంస్థ తరుపున వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని భూపాల్ నాయక్ అన్నారు. కిసాన్ పరివార సంస్థ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అసలు నేను రాజకీయంలోనే రావద్దనుకుంటున్నా కానీ డోర్నకల్ నియోజకవర్గ పరిస్థితి మరి దారుణంగా ఉందని, ఒకరు కూడా ఆకలితో అలమటించకుండా నిరుద్యోగం లేకుండా చేస్తానని, అందరం సమన్యాయంతో కలిసి ఉద్యమిస్తామని, కాంగ్రెస్ పార్టీ నేతలు జాటోత్ రామచంద్రనాయక్, మాలోత్ నెహ్రూ నాయక్ నా మిత్రులే అని ఆయన అన్నారు. సభ మధ్య లోనే విద్యుత్ రాకపోవడంతో 24 గంటల కరెంటు అని చెప్పుకుంటున్న ప్రభుత్వం మనకు అవసరానికి లేకపోతే ప్రయోజనం ఏమిటి అని ఆయన అన్నారు.నేను రైతు కుటుంబం నుండి వచ్చినవాన్ని రైతు కష్టం ఏంటో నాకు కూడా తెలుసు ప్రతి ఒక్కరు రైతుల గురించి మాట్లాడతారు కానీ రైతుల పక్షాన నిలబడింది ఎవరు! వారి సమస్యలు తీర్చిన మహానుభావుడు ఎవరు, ప్రతి ఒక్క నాయకుడు రాజకీయం చేయడానికి వస్తారు కానీ వారి సమస్యలను తీర్చే నాయకుడు నాకు ఇప్పటి వారికి కనబడలేదని కాబట్టి ఇప్పటినుండి డోర్నకల్ గడ్డమీద రాజకీయం రంగంలోకి దిగుతానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు భీమా నాయక్, విష్ణు నాయక్,డోర్నకల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుమీర్ కుమార్ జైన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అచ్యుతరావు, తదితరులు పాల్గొన్నారు.