సముద్ర రవాణాకు ఏపీ కీలకం

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షులు అరవింద్‌ పనగారియా, సిఇఒ అమితాబ్‌ కాంత్‌లతో సిఎం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పనగారియాకు రాష్ట్రంలోని వివిధ అంశాలపై సిఎం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సిఎం మాట్లాడుతూ తూర్పు తీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కోస్టల్‌ ఎకనామిక్‌ జోన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీని ద్వారా సముద్ర రవాణాకు రాష్ట్రం అత్యంత కీలకం కానుందన్నార. దేశంలో రెండు కోస్టల్‌ ఎంప్లాయిమెంట్‌ జోన్స్‌ తీసుకురావడానికి పరిశీలన చేస్తున్నట్లు సిఎం తెలిపారు. చైనాలోని షాంజౌ వంటి ప్రాంతాల మాదిరిగాimages కోస్టల్‌ ఏరియా ఉత్తత్తి, ఎగుమతి జోన్‌గా అవతరిస్తుందన్నారు. ప్రపంచంలో ఇలాంటి బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ ఎక్కడున్నా నీతిఆయోగ్‌ పరిశీలించి వాటిని రాష్ట్రాలలో అమలు చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో మూడు ఇండిస్టీయల్‌ కారిడార్లు అభివృద్ధి చేయటానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌లో మచిలీపట్నం, దోనకొండ, శ్రీకాళహస్తి, ఏర్పేడులో పరిశ్రమలు రానున్నాయన్నారు. దీంతో పాటు బెంగళూరు-చెన్నై కారిడార్‌ను కూడా ఆభివృద్ధి చేస్తారన్నారు. ఇందులో ఓర్వకల్లు, హిందుపూర్‌, కృష్ణపట్నం ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్ని క్లస్టర్‌గా అభివృద్ధి చేయనున్నట్లు సిఎం పేర్కొన్నారు. 

తాజావార్తలు