సాగర్ నీటి విడుదల కోసం ఎదురుచూపు
గుంటూరు,అక్టోబర్26(జనంసాక్షి): రబీలో పంటల సాగుకు నీరు విడుదల చేద్దామని మంత్రి చెప్పారని, ఆయనతో చర్చించాక ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనతో సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎక్కువ నీరు పంటకు వినియోగిస్తే దిగుబడులు ఎక్కువ వస్తాయనే భావన రైతుల్లో ఉందని దీన్ని తొలగించుకోవాలన్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 540 అడుగుల మేరకు నీటి నిల్వలున్నాయని గతంలో ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా రబీలో పంటల సాగుకు నీరు విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో నీటి వాడకంతో ఆయకట్టు చివరి భూములకు సైతం సాగర్ కాల్వల నుంచి నీరందించే అవకాశముంటుందన్నారు. ఒక పంటగా వరి సాగు చేపడితే ప్రయోజనకరమని ఆయన చెప్పారు. వ్యవసాయంతోపాటు అనుబంధంగా పాడి, మత్య్స పరిశ్రమలపై రైతులు దృష్టి సారించాలన్నారు.
సాగర్ అయకట్టుకింద నీటి కోసం ఎదురు చూస్తున్నామని రైతులు వెల్లడించారు. ఈ ఏడాది తొలకరిలో మంచి వర్షాలు కురిసినా వర్షాభావ సమస్య ఖరీఫ్ చివరికి తప్పలేదన్నారు. భారీ వర్షాలతో వాణిజ్య పంటలు, ఆరుతడి పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక పంట అయినా రైతులకు దక్కేలా చూడాలని కోరుతూ వచ్చామని అన్నారు. ఇకపోతే వరదలతో రోడ్లు, చెరువులకు కలిగిన నష్టాన్ని పూడుస్తామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న పట్టణ, గ్రావిూణ గృహనిర్మాణ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. దామాషా ప్రకారం గృహనిర్మాణాలకు లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపడతామని తెలిపారు. పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయాన్ని గాడిన పెట్టేందుకు పక్కా కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు.