సాగునీటి రంగానికి పెద్దపీట: ఎంపి

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి కోసం ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. రైతుల కోరిక మేరకు బూరుగుమాను కట్టు గెడ్డపై కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్టు ఎంపీ వెల్లడించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, నీరు-చెట్టు, మన వూరు- మన చెరువు కార్యక్రమం కింద సాగునీటి చెరువుల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని  చెప్పారు. అయితే దీనిని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివీద్దిని చూసే అనేకమంది నాయకులు అధికార పార్టీలో చేరుతున్నారని అన్నారు.  సాగునీటి వనరుల స్థిరీకరణకు గెడ్డలపై చెక్‌డ్యామ్‌, ఆనకట్టలు, చిన్నచిన్న ఆనకట్టలు, పొర్లుకట్టులు వంటివి చేపట్టేందుకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్టు చెప్పారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడకుండా అవసరమైన చోట పనులు చేయాలని సి.ఎం చంద్రబాబునాయుడు సూచించారన్నారు. ఇదిలావుంటే ఉపాధ్యాయులు, ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం రద్దు చేసి పాత విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ  పేర్కొన్నారు.  పెన్షన్‌ విధానాన్ని 2014లో అప్పటి ప్రభుత్వం రద్దు పర్చడం దురదృష్టకరమన్నారు. సీపీఎస్‌ విధానం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి బడ్జెటు నుంచి కేటాయించి చెల్లించేవారన్నారు. ప్రయివేటు వ్యవస్థకు పునాది వేయడానికి గత ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఉద్యోగుల సమస్యలను తీసుకువెళ్లాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంపిని కోరారు.

తాజావార్తలు