సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి

జనంసాక్షి, మంథని : పర్యావరణ పరిరక్షణ కోసం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పెద్దపల్లి జిల్లా మంథని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఇందారపు రాంకిషన్ కోరారు. మంథని ఎల్ ఐసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ అవరణలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేనేజర్ ఇందారపు రాంకిషన్‌ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని సమతోల్యం చేయడంలో మొక్కలు కీలక భూమికి పోషించి జీవ కోటికి ప్రాణవాయువు పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ బెజ్జాల హరికిరణ్, జీపీసీ రెడ్డి, ఆఫీసర్ శ్రీనివాస్, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పర్యావరణ ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తి, ఏజెంట్స్ పాల్గొన్నారు.

తాజావార్తలు