సామాన్యులకు తప్పని ఇక్కట్లు
అనంతపురం,నవంబర్11(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు,జిఎస్టీల వలన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ కార్యదర్శి జగదీశ్వర్ అన్నారు. నల్లధనం వెలికితీత పేరుతో సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విదేశాల్లో దాగి ఉన్న నల్లధనాన్ని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చినహావిూ మేరకు విదేశాల్లో దాచిన నల్లడబ్బును తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ముసుగుల్లో బ్యాంకులను రుణాలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులను విస్మరించి, బడా పారిశ్రామికవేత్తలకు మేలు జరిగేలా చూస్తున్నాయని విమర్శించారు. దేశంలో అవినీతి, దోపిడీ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై కమ్యూనిస్టులు ఉద్యమాలు కొనసాగిస్తాయని తెలిపారు.