సింగరేణి కాంట్రాక్ట్ కార్మి కుల వేతనాలు పెంచాలి-ఎస్ ఎల్ పద్మకార్మిక గర్జన పోస్టర్స్ ఆవిష్కరణ
ఇల్లందు జూలై 31 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జెకె సివిల్ కాంటాక్ట్ కార్మికుల మస్టర్ అడ్డా వద్ద కార్మిక గర్జన పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ ఆవిష్కరణలు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతు..సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల పట్ల కెసిఆర్ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఈరోజు జరుగు క్యాబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే ఎన్నికలలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు. వేతన జీవోలకు వెంటనే గెజిట్ విడుదల చేయాలన్నా రు. ఆగస్టు 4న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో హైదరాబాద్ కార్మిక గర్జనను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు పాయం వెంకన్న కాంట్రాక్టు వర్కర్స్ నాయకులు లింగమూర్తి శ్రీను చారి శ్రీనివాస్ రాజేశ్వరి లీలా బాయ్ గంగ జమున తరుణ్ దుర్గ సాల్ కి
తదితరులు పాల్గొన్నా రు