సింహాచలం ధర్మకర్తగా అశోకగజపతి రాజు
విశాఖపట్టణం,ఏప్రిల్2(జనంసాక్షి): మాజీమంత్రి, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఆనందగజపతి మరణించడంతో ఇప్పుడా పదవిని కేంద్రమంత్రి, అనందగజపతి తమముడు అశోక గజపతిరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనప ఈ నెల7న దేవాలయ సందర్శనకు రానున్నారని సమచారం. అదే రోజు ఆయన ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్తగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దివంగత పీవీజీ రాజు తర్వాత దివంగత ఆనందగజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరించారు. ఆయన అనంతరం అశోక్ గజపతిరాజును వంశపారంపర్య ధర్మకర్తగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అశోక్ త్వరలోనే సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దివంగత ఆనందగజపతిరాజు పెద్దకర్మ అనంతరం ఈ నెల 7వ తేదీన అశోక్ అప్పన్న స్వామి దర్శనానికి సింహాచలం రానున్నట్లు తెలిసింది. ఈ దేవాలయానికి గజపతిరాజులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే వివిధ ధర్మకర్తల మండళ్లకు కూడా ఆనందగజపతి తదుపరి బాధ్యతలు స్వీకరించే అవకావం ఉంది.