సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి – సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్


జనంసాక్షి, మంథని : మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 12వ తేదీన హైదరాబాదులోనే సిడిఎంఏ కార్యాలయం ముందు జరిగే ధర్నా కు సంబంధించిన వినతి పత్రాన్ని మంథని మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని పిఆర్సి చైర్మన్ సిఫార్సుల ప్రకారం కనీస వేతనం కేటగిరీల వారిగా 19000, 22000, 34000, అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రమాదంలో మరణించిన కార్మికులకు 25 లక్షల అదేవిధంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు 12 గంటలపాటు పనిచేస్తూ ప్రేమదో గుడికి గురి అవుతున్నారని ఒక్క పూట పని విధానాన్ని అమలు చేయాలని చనిపోయిన కార్మికుని యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం దేవమిచ్చి పది లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా మంథని మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు, నూనెలు, చెప్పులు, తదితర వస్తువులు ఇప్పటికీ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా వెంటనే కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరూ చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగారపు గట్టయ్య, చిప్పకుర్తి చందు, ఎడ్లపల్లి రాజయ్య, మల్లేష్, శ్రావణ, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు