సినిమాను తలపిస్తున్న అక్రమ కలప రవాణా

ఒకే నెంబరు…రెండు వాహనాలు

ఒక వాహనం అతనిదే…మరో వాహనం ఎవరిది…?

రెండు వాహనాలు అతనివే…ఒకే నెంబర్ ప్లేట్ ఎందుకు…?

కొత్తగూడ ఆగస్ట్14 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో సినిమాను తలపిస్తున్న అక్రమ కలప రవాణా…మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రాంపూర్,ఎర్రారం మార్గ మధ్యలో అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న లక్ష రూపాయల టేకు కలపను అటవీ శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకోవడం జరిగింది.అనంతరం స్థానిక రేంజ్ కార్యాలయానికి తరలించి దాని యొక్క పూర్తి వివరాలు పొందుపరుస్తున్న క్రమంలో గతంలో ఇదే నెంబర్ ప్లేట్ తో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనం ఉండడం గమనార్హం…ఒక్కసారిగా అవాక్కైనా అధికారులు…ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలోనే ఇదే నెంబర్ పై ఉన్న మరో వాహనం గత నెల రోజులుగా ఫారెస్ట్ కార్యాలయంలోనే ఉంటుంది.ఒకే వ్యక్తికి చెందిన రెండు వాహనాలు గా గుర్తించిన అధికారులు…గుర్తించడానికి వీలు లేకుండా ఒకే రకంగా (డిజైనింగ్) చేపించి నకిలీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకొని టేకు కల్ప రవాణా చేయడం జరుగుతుంది.గతంలో వాహనంలో రెండు లక్షల కల్ప ప్రస్తుతం దొరికిన వాహనంలో సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా…అశోక్ లేలాండ్ వాహనంతో పాటు ద్విచక్ర వాహనం ను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.అశోక్ లేలాండ్ వాహనం లడాయిగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఒకే నెంబర్ తో రెండు అశోక్ లేలాండ్ వాహనాలు నడుపుతూ అధికారులను మోసం చేస్తూ… తన అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాటుపడుతూ ఉండడం గతంలో పట్టుకున్న వాహనం నెంబర్ టిఎస్ 26 టిఏ 0748 ఇప్పటికీ ఫారెస్ట్ ఆఫీస్ ఆధీనంలోనే ఉంది.ఇది ఇలా ఉండగా ఏజెన్సీ ప్రజల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక వాహనం అతనిదే…మరో వాహనం ఎక్కడిది….? రెండు వాహనాలు అతనివే అయితే…ఒకే నెంబర్ ప్లేట్ ఎందుకు రాసారు….? ఒకే రకంగా (డిజైనింగ్) చేసి ఒక్క నెంబర్ ప్లేట్ తో రెండు వాహనాలు నడపడానికి గల కారణాలు స్మగ్లింగ్ కోసమేనా…ఇతర కారణం ఉందా అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది..

తాజావార్తలు