సిపిఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలి- పీఆర్టియు మండల అధ్యక్షులు కానుగుల రఘుపతి.
చిట్యాల ఆగస్టు 7 (జనంసాక్షి) సిపిఎస్ విధానం రద్దు చేసే పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని పిఆర్టియు మండల అధ్యక్షులు కానుగుల రఘుపతి అన్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విరామ సమయంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కరపత్రాన్ని ఉపాధ్యాయులకు అందజేస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిరసన తెలిపారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిఆర్సి కమిటీని వేసి వెంటనే మభ్యంతర భృతిని ప్రకటించాలని ,పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను వెంటనే ప్రకటించాలని ఏరియాస్ ను వాయిదాల ప్రాతిపదికన కాకుండా ఒకే మొత్తంగా చెల్లించాలని పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు .317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు అవకాశం కల్పించాలని, సూపర్ న్యుమరి పోస్టులను మంజూరు చేస్తూ స్పౌజ్ అప్పీళ్ళు ,జీవోఅమలులో తలెత్తిన అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఈఎచ్ఎస్ కార్డులను అన్ని హాస్పిటల్లో అమలు చేయాలని, మోడల్ స్కూల్, కేజీబీవీ టీచర్స్ సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ సర్వ శిక్ష అభియాన్ పై పని చేస్తున్నా వారిని కొనసాగిస్తూ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈనెల 10, 19న జరిగే జిల్లా రాష్ట్రస్థాయిలో జరిగే దార్న లో అందరూ ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిపియూఎస్ మండల గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ రఘుపతి ,జిల్లా బాధ్యులు బుర్ర సదయ్య, మండల కార్యదర్శి మండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు సతీష్, అశోక్, కార్యదర్శి సాంబయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.