సి -5 ఓబి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సమాచారం లేదటా..?

– సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అధికారుల రిప్లై

– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట  తిరుపతి యాదవ్ వెల్లడి

జనంసాక్షి, మంథని : గత నాలుగైదు నెలలుగా ఆర్ జి త్రీ పరిధిలోని ఓసిపి 2 లో ఓబీ పనులు నిర్వహిస్తున్న సి-5 అనే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సమాచారం లేదని, సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు అధికారుల రిప్లై ఇచ్చారని, ఇది విడ్డూరంగా ఉందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట  తిరుపతి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సి ఫైవ్ కాంట్రాక్టర్ గత నాలుగైదు నెలల నుండి ఓబీ పనులు నిర్వహిస్తున్నారని, సింగరేణిలో పనులు చేసే కాంట్రాక్టర్ అతడు టెండర్ లో పాల్గొని టెండర్ వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీ తో అగ్రిమెంట్ చేసుకుని పనులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కానీ ఇచ్చట నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నాడని తెలుస్తున్నదన్నారు. ఒక ఏరియా పరిధిలో జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో ఒక్కొక్క ఓసీపీకి ఒక్క ప్రాజెక్టు అధికారి ఉండి అట్టి ప్రాజెక్టును ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నారు అని , అట్టి పనులకు సంబంధించిన సింగరేణి, ప్రైవేటు కాంట్రాక్టర్ టెండర్ వచ్చిన సమయంలో చేసుకున్న అగ్రిమెంట్ కాపీ సమాచార హక్కు చట్టం కింద ఆర్ జి త్రీ వారిని అడుగగా వారు ఓసిపి టు కాలరీ మేనేజర్ కి పంపిస్తే మా వద్ద సమాచారం లేదని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి లిఖిత పూర్వకంగా లెటర్ రాసి వారికి పంపించగ వారు మా దగ్గర సమాచారం లేదనిసమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. ఒకవేళ వారు చేసిన పనిని బిల్లులు తీసుకోవాలంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వారు కూడా అగ్రిమెంట్ కాపీ లేనిదే ఎలా బిల్లులను పాస్ చేస్తున్నారు..? అని, అగ్రిమెంటులో వారికి వచ్చిన టెండర్ రేటు ఎంత..?, బిల్లులు రికార్డు చేసిన దాని ప్రకారం టెండర్ అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం బిల్లులు చెల్లింపులు చేయాలి.. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. ఎందుకంటే మైన్స్ అథారిటీ మరియు ప్రాజెక్టు అధికారి, జనరల్ మేనేజర్ వారి వద్ద నుండి సమాచారం హక్కు క్రింద అడిగిన దానికి రిప్లయ్ ఇచ్చిన దాని బట్టి స్పష్టంగా తెలుస్తుందని తిరుపతి యాదవ్ ప్రకట
నలో పేర్కొన్నారు.

తాజావార్తలు