సీఎం కెసిఆర్ కృషితోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.
– బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్
– సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
మర్పల్లి ఆగస్టు 11 (జనం సాక్షి) సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రలను కేసులను చేదించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాదించడం సంతోషకరమని బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్ అన్నారు. శుక్రవారం రోజున పట్లూర్ గ్రామ పార్టీ గ్రామ కమిటి అద్యక్షులు జి. అశోక్ అధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే రెండవ దశ పనులు కూడా ముందుకు సాగే అవకాశం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, అనుమతుల సాధనలోనూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి సాటిలేదని నిరూపించుకుందఅన్నారు. ఇది తెలంగాణ సర్కారు సంకల్పానికి మరో నిలువెత్తు నిదర్శమని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అద్యక్షులు జి. అశోక్, ఉపసర్పంచ్ మొయిజ్ , రైతుబంధు సమితి గ్రామ అద్యక్షులు శేకర్ స్వామీ, మైనారిటి నాయకులు షఫి, సినియర్ నాయకులు మోహన్, ప్రభాకర్, నాయకులు వికాస్, బాలేష్, అరుణ్, పవన్, షాహీద్, నర్సింలు, తదితరులు పాల్గొనరు.