సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎల్ఓసి గాని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కె దక్కుతుంది

 

బి ఆర్ ఎస్  నాయకులు చింత సాయినాథ్

బాధిత కుటుంబానికి ఎల్ఓసి

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 8     ::  ========

:సదాశివపేట పట్టణంలోని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆరూరి గ్రామానికి చెందిన శాంతాల్ల సంగమేశ్వర్ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల 50 వేల విలువగల ఎల్వోసిని ఎంపీపీ తొంట యాదమ్మ కిష్టయ్యతో కలిసి అందజేసిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చింతా సాయినాథ్.

ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేక ఆపరేషన్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్యం నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎల్ఓసి గాని ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. సంగమేశ్వర్ కుటుంబ సభ్యులు గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై ఆపరేషన్ నిమిత్తము వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ చింత ప్రభాకర్ ను ఆశ్రయించారన్నారు. వెంటనే స్పందించి మంత్రి హరీష్ రావుకు విన్నవించి వెంటనే ఎల్ఓసి తీసుకురావడం జరిగిందన్నారు. బాధిత కుటుంబం తరపున ఆరుర్ ఎంపిటిసి అల్లం లలిత చింతా ప్రభాకర్, హరీష్ రావు లకు గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, సర్పంచులు కోడూరు రాములు, నరేష్ గౌడ్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బేగరి సుధాకర్, మాజీ ఎంపిటిసి శివకుమార్, సిద్దన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు