సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి.
ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా.
తాండూరు జులై31(జనంసాక్షి)వానాకాలం సీజన్లో గో జాతి గేద జాతి పశువులకు గాలికుంటు వ్యాధి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అందించే వ్యాధి నిరోధక టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా పేర్కొన్నారు. సోమవారం మండల వ్యాప్తంగా అందించే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పగిడ్యాల గ్రామంలో సర్పంచ్ బసిరెడ్డి, మండల పశు వైద్యాధికారి శ్రీకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను 30 రోజులపాటు అన్ని గ్రామాలలో అందించనున్నామన్నారు. మూడు టీములుగా పశు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతిరోజు మూడు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నమన్నారు. మండల వ్యాప్తంగా 12, 400 పశువులకు ఈ వ్యాధి నిరోధక టీకాలను అందించనున్నారు. మండలంలోని అన్ని పశు వైద్యశాలలో టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుం దన్నారు.పశు వైద్య సిబ్బంది స్వయంగా ప్రతి గ్రామానికి వచ్చి అందించే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మండల ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు ఎంపీటీసీ రాములు, సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, సీనియర్ నాయకులు పేర్కంపల్లి వెంకట్, పశు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.