సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ముందు చర్యలు
చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- మండలంలోని బండపోతుగల్ గ్రామంలో ప్రతి వార్డులో ఫ్రైడే డ్రై డే లో భాగంగా శుక్రవారం నాడు ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తగా తమ ఇంటి పరిసరాల చుట్టూ శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని మన ఇంటి పరిసర ప్రాంతాల చుట్టూ శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అనగా మలేరియా,టైఫాయిడ్,డెంగ్యూ,వైరల్ ఫీవర్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసరాలు కొబ్బరి చిప్పలు, టైర్లు, రోకలి బండలు, నీళ్ల తొట్టెలు, ప్లాస్టిక్ బాటిళ్లు లో నిల్వ ఉంచిన నీళ్లను తొలగిస్తూ ప్రజలను అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సెక్రెటరీ ఆనంద్, అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, ఫైజాబాద్ MLHP స్వప్న, ఆశా వర్కర్ వినోద, యువకులు బి మగ్ధూం, జి మహేష్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు