సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ఈ నెల 18న జిల్లా కేంద్రంకు చేరుకోనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు లక్కపాక ప్రవీణ్ కుమార్ తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలో టీఎస్ సీపీఎస్ఈయు పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర వాల్ పోస్టర్లను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సూర్యాపేట మండల అధ్యక్షులు శ్యామసుందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.18న జరిగే రథయాత్రకు పెన్షనర్ల సంఘము సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ఈయు జిల్లా కార్యదర్శులు నారాయణ సతీశ్ కుమార్, పల్లి వీరారెడ్డి, సంయుక్త కార్యదర్శి సురభి శేఖర్, జిల్లా నాయకులు గడగొజు మధు కుమార్, ఐతరాజు మల్లికార్జున్, సూర్యాపేట డివిజన్ కోశాధికారి మేక వంశీ, నూతనకల్ అధ్యక్షుడు ఢీకొండ మహేష్, ఆత్మకూరు(ఎస్) మండల అధ్యక్షుడు గుణగంటి సురేందర్, మద్దిరాల మండల నాయకులు జలగం అబ్రహం, గద్దల చంద్రశేఖర్, పెన్షనర్ల సంఘం నాయకులు వి.రామయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు