సీబీఎస్ఈ పేరు చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు…. గ్రీన్ వుడ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల గ్రీన్ హుడ్ పాఠశాల ఎదుట వుడ్ పాఠశాల కరపత్రాలు దగ్ధం చేసారు సీబీఎస్ఈ గుర్తింపు లేకున్నా సీబీఎస్ఈ పేరుతో పాఠశాల నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న గ్రీన్ వుడ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేసారు…ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కూతవేటి దూరంలో గ్రీన్ వుడ్ పాఠశాల యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండానే సీబీఎస్ఈ విద్య అంటూ గ్లోబల్ ప్రచారం చేస్తూ అడ్మిషన్స్ తీసుకున్నారని అంతేకాకుండా జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అమాయక తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్వం ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి గ్రీన్ వుడ్ పాఠశాల యాజమాన్యం చేస్తున్న మోసాన్ని అడ్డుకొని గుర్తింపు రద్దు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.*

ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ టివియువి రాష్ట్ర కార్యదర్శి, బచ్చలి ప్రవీణ్ కుమార్ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు, సల్మాన్ బిసివిఎస్ జిల్లా అధ్యక్షుడు, రేగుంట క్రాంతి కుమార్ టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు, జాగిరి రాజేష్ టీబీఎస్ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంజయ్ కుమార్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, విద్యార్థి సంఘాల నాయకులు అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు