సువెన్ కంపెనీని మూసివేయాలి విస్తరణ అనుమతులను రద్దు చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సువెన్ ఫార్మా కంపెనీని మూసివేయాలని, ఆ కంపెనీకి ఇచ్చిన విస్తరణ అనుమతులను రద్దు చేయాలని సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.జిల్లా కేంద్రంలోని సువెన్ ఫార్మా కంపెనీ చుట్టుపక్కల ఆవాస వార్డులైన 5, 6,18 వార్డుల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.కంపెనీ వలన శ్వాసకోస, కిడ్నీ , లంగ్స్, గుండె జబ్బులకు ప్రజలు గురవుతున్నారని, వాతావరణం అంతా కాలుష్యమవుతుందని తెలిపారు. కంపెనీ యొక్క వ్యర్థాలను రాత్రిపూట వదులుతూ ప్రజలకు హాని చేసే విధంగా కంపెనీ వ్యవహరిస్తుందని, దీనిపైన పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలకు ఆరోగ్య రక్షణ కింద సిఎస్ఐఆర్ నిధులనుంచి పది లక్షల రూపాయలను ఇచ్చే విధంగా అడిగితే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం 23 టీఎంపి ఉన్న కంపెనీకి 250 టీఎంపీకి అనుమతులు ఇచ్చారని చెప్పారు.ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువగా ఉందని,ఇంకా పెంచితే ఎలా జీవించాలని ప్రశ్నించారు.ఈ విషయంపై రాజకీయ నాయకులకు అనేక సార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. భయభ్రాంతులకు గురి చేయట, గిరిజన ప్రజలను పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు.సువెన్ కంపెనీ మూసివేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.ఈ సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రేక్యా నాయక్, ఎల్ హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్, చంపలాల్ నాయక్, శ్రీమాన్, మహేష్, సురేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.